కాళేశ్వరంపై పిచ్చి కూతలు కట్టిపెట్టు.

`తెలంగాణ వరదాయిని కాళేశ్వరం.

`కాళేశ్వరంతో తెలంగాణ సస్యశ్యామలం.

`ప్రపంచంలోనే కాళేశ్వరం ఒక అద్భుతం. 

`కేంద్రం సహకారం లేకుండా చేసిన నిర్మాణం.

`కేంద్రమే పార్లమెంటు సాక్ష్యిగా అవినీతికి జరగలేదని చెప్పింది.

`ఐదేండ్లు అడిగినా, తెలంగాణలో చిన్న రిజర్వాయర్‌ కూడా వైఎస్‌ కట్టలేదు?

`తెలంగాణ వచ్చాక కాళేశ్వరం కట్డుకుంటే షర్మిల కళ్లు మండుతున్నాయా?

`జలయజ్ఞం పేరుతో ధన యజ్ఞం చేసి తెలంగాణను దోచుకున్నది వైఎస్‌.

`బతకమ్మ తెలియదు, బోనం తెలియదు, తెలంగాణ నైసర్గిక స్వరూపం షర్మిలకు తెలియదు.

`తెలంగాణలో భూకంపాలా? ఏ సన్నాసి చెప్పిండు?

 `అక్కడ అన్నను అడగలేదు! ఇక్కడ బడాయి తక్కువలేదు!!

`స్థాయికి మించి షర్మిల పేకుడు ముచ్చట్లు?

`ఏతులెన్ని చెప్పినా తెలంగాణలో చెల్లవు?

`ప్రతి వాళ్లు కాళేశ్వరం గురించి మాట్లాడే వాళ్లే?

`అన్నను పోలవరం సంగతేమిటని అడిగే శక్తి లేదు?

`ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్‌. పెంకాసులు పోగేసుకున్నాడా?

`వైఎస్‌ బతికుండగానే లక్ష కోట్లు దోచుకున్నాడని పుస్తకాలు వేశారు?

`ఎన్నికల ముందు ఇల్లు అమ్ముకునే స్థితి నుంచి వైఎస్‌ కు ఇన్ని ఆస్థులెక్కడివి?

`రాజన్న రాక్షస రాజ్యం తరిమేసే…తెలంగాణ సాధించుకున్నాం.

`ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో డిల్లీలో షర్మిల ధర్నానుద్దేశించి, తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చెప్పిన ఆసక్తికరమైన విషయాలు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

తెలంగాణ అంటే ఏమిటో తెలియదు. తెలంగాణ యాస తెలియదు. అసలు మాట్లాడనే రాదు…తెలంగాణ పేరెందుకొచ్చిందో తెలియదు. అసలు తెలంగాణకు అర్ధమే తెలియదు. తెలంగాణ కట్టు తెలియదు. బొట్టు తెలియదు. బోనం తెలియదు. బతుకమ్మ అంతకన్నా తెలియదు. తెలంగాణలో బతుకమ్మను ఎందుకు పూజిస్తామో తెలియదు. తెలంగాణ ఉనికి తెలియదు. తెలంగాణ చరిత్ర తెలియదు. తెలంగాణ ఉద్యమం ఎందుకు చేశారో తెలియదు. నైసర్గిక స్వరూపం అసలే తెలియదు. ఎనమిదేళ్ల క్రితం తెలంగాణ ఎలా వుండేదో తెలియదు? ఇప్పుడు ఎలా వుందో చూడలేరు. నిజాలు మాట్లాడేందుకు నోరు రాదు. కాని తెలంగాణ రాజకీయాలు కావాలి. తెలంగాణలో నాయకత్వం కావాలి. మన దౌర్భాగ్యం కాకపోతే తెలంగాణకు అడుగడుగునా అడ్డుపడుతూ, తాను అడ్డూ కాదు,నిలువూ కాదంటూ వెటకారం చేసిన రాజశేఖరరెడ్డి బిడ్డ షర్మిల తెలంగాణపై మొసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా లేదా? తెలంగాణను నిలువెల్లాదోచి, తెలంగాణను ఎండబెట్టి, పండబెట్టిన వైఎస్‌ కూతురొచ్చి చిలకపలుకులు పలుకుతుంటే తెలంగాణ ఉద్యమ కారులైన మేం వినాల్సి వస్తోంది. 2004లో బిఆర్‌ఎస్‌తో పొత్తు లేకుంటే అసలు ఆనాడు కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేదే కాదు…వైఎస్‌ ముఖ్యమంత్రి అయ్యేవారే కాదు… కేవలం తన స్వార్ధపూరిత రాజకీయాల కోసం, తాను ముఖ్యమంత్రి కావడంకోసం, తన కల నెరవేర్చుకోవడం కోసం , కాకమ్మ కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చాడు. వచ్చిన వెంటనే తెలంగాణపై విషం కక్కడం మొదలుపెట్టాడు. తెలంగాణ వాదం బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను మాయచేసి, మభ్యపెట్టి, అదిరించి, బెదిరించి కాంగ్రెస్‌లో కలుపుకున్నాడు. తెలంగాణ వాదం లేదనే కుటిల ప్రయత్నం చేశాడు… ఆఖరకు 2009 ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదని తెలిసి, తెలంగాణకు వెళ్లాంటే పాస్‌పోర్టు కావాలా? అంటూ సీమాంధ్రులను రెచ్చగొట్టి గెలిచిన వైఎస్‌. కుటుంబం నుంచి షర్మిల తెలంగాణ రాజకీయాలపై ఆశలు పెంచుకోవడం మరీ దుర్మార్గం…మాట్లాడొస్తే చాలు నీతులు చెప్చొచ్చు…ఒర్రడమొస్తే చాలు బూతులు తిట్టొచ్చు అని షర్మిల మాటలు చూస్తేనే అర్ధమౌతుంది. తెలంగాణకు రాజశేఖరరెడ్డి చేసిన అన్యాయం బరించలేకే, తెలంగాణలో వైఎస్‌ కుటుంబానికి స్ధానం లేదని తెలంగాణ సమాజం ముక్త కంఠంతో చెప్పింది. ఆ సమయంలో జరిగిన పరాకాల ఉప ఎన్నిక ఫలితం ఏమైందో అందరికీ తెలిసిందే…వైఎస్‌ అన్న పదానికే తెలంగాణలో స్ధానం లేదని మహబూబాబాద్‌ రైల్లే స్టేషన్‌ రాళ్లు ఇప్పటికీ చెబుతాయి. చరిత్ర వున్నంత వరకు ఆ రాళ్లు నాటి తెలంగాణ పౌరుషం గురించి మీసం మెలేస్తాయి. ఆనాడు ఏం జరిగిందో ఆ రాళ్లనడిగితే వివరిస్తాయి. అంటూ నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పంచుకున్న ఆసక్తికరమైన అంశాలు ఆయన మాటల్లోనే పాఠకుల కోసం…

మొన్నటిదకా జగనన్న బాణాన్ని అంటూ చిలకపలుకులు పలికి, ఇప్పుడు తగుదునమ్మా? 

అని తెలంగాణకొచ్చి అన్నతో చెడిరదని చెప్పి, అయ్య రాజశేఖరెడ్డి తెలంగాణ రాసిచ్చినట్లు రాజకీయాలు చేస్తానంటే ఇక్కడ వినడానికి ప్రజలు సిద్దంగా లేరు. గత ఎన్నికల్లో అన్నకు అధికారం కోసం ప్రచారం చేసి, అక్కడ పోలవరంలో తట్టెడు మట్టి ఎత్తిపోయని అన్న గురించి మాట్లాడే శక్తి లేదు…కాని ఇక్కడ తెలంగాణలో కాళేశ్వరం మీద షర్మిల మాట్లాడుతుంటే వింతగా వుంది. అసలు కాళేశ్వరం అంటే ఏమిటో కూడా షర్మిలకు తెలుసా? తెలంగాణలో పలలేని,పని లేని వాళ్లు చెప్పే ముచ్చట్లు విని మాట్లాడడం కాదు… ముందు అసలు కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఏమిటో తెలుసుకో…తర్వాత దాని మీద ఏం జరిగిందనేది మాట్లాడుతువుగాని…కాళేశ్వం ప్రాజెక్టు నిర్మాణం అన్నది ఒక అధ్భుతం. ఈ ఎనమిదేళ్ల కాలంలో తెలంగాణలో ఎన్ని రిజర్వాయర్లు నిర్మాణం జరిగిందో షర్మిలకు తెలుసా? ఆ రిజర్వాయర్లు ఎక్కడెక్కడున్నాయో? తెలుసా…వాటిపేర్లుకూడా తెలియవు…కాని కాళేశ్వరం అన్న ఒక్క పదం పట్టుకొని డిల్లీకి వెళ్లి గోల చేస్తే, గాయి, గాయి చేస్తే సరిపోతుందా? అసలు కాళేశ్వరం ప్రాజెక్టు అన్నది కేవలం తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్ధాయిలో నిర్మాణం చేసుకున్న ప్రాజెక్టు. ఇందులో కేంద్ర ప్రభుత్వానిది ఒక్క రూపాయి కూడా లేదు. అంతే కాదు కాళేశ్వరంలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేదని కేంద్ర ప్రభుత్వమే సాక్ష్యాత్తు పార్లమెంటులో పలు సార్లు వివరణిచింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. కనీసం వాటి గురించైనా షర్మిల తెలుసుకుంటే బాగుండేది. కాళేశ్వరం అన్నది ఒక్క ప్రాజెక్టు కాదు..దాని కింద మొదలైన మూడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లతోపాటు, తెలంగాణలో నిర్మాణం జరిగిన రిజర్వాయర్లన్నీ దాని పరిధిలోకే వస్తాయి. ఆ మాత్రం అవగాహన కూడా లేదు. కాని కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నోరుంది కదా? అని మాట్లాడితే సరిపోదు…

నేను ముఖ్యమంత్రికావాలి…నేను ముఖ్యమంత్రి కావాలి…

అని ఇరవై ఏండ్లు పార్టీలోనే అసమ్మతి నేతగా ఎవరూ మెచ్చని నేతగా, ఆనాటి సీనియర్లతో పంటి కింద రాయిలా, కంటిలో నలుసులా వ్యవహరించి రాజశేఖరరెడ్డి మనస్తత్వాన్ని ఏ కాంగ్రెస్‌ వాది మెచ్చలేదు. నచ్చలేదు. అలాంటి వైఎస్‌ అధికారంలోకి రావడానికి కారణమైన తెలంగాణకు తీరని అన్యాయం చేశాడు. తెలంగాణ పేరు చెప్పి అధికారంలోకి వచ్చి, తెలంగాణ భూములమ్మి ఆంధ్రలో రిజర్వాయర్లు పూర్తి చేసిన దుర్మార్గుడు వైఎస్‌. అలాంటినేత పేరు చెప్పుకొని ఓట్లు రాల్చుకుంటా…రాజకీయాలు చేస్తా అంటే ఎవరూ నమ్మరు…మీ అన్న జగన్‌నే తెలంగాణలో ఎవరూ నమ్మలేదు. సాక్ష్యాత్తు పార్లమెంటులో తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డు పట్టుకొన్న జగన్‌ను తెలంగాణ ప్రజలే తిరస్కరించారు. తండ్రి వైఎస్‌ తెలంగాణకు అలా అన్యాయం చేస్తే, అన్న జగన్‌ ఈ విధంగా తెలంగాణను అడ్డుకున్నాడు. ఇప్పుడు చెల్లె షర్మిల వచ్చి, తెలంగాణలో రాజకీయాలు చేస్తానంటే నడుస్తుందా? జగనన్న బాణాన్ని అని నిన్నటిదాకా చెప్పుకున్న షర్మిల, ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ఎందుకు పూర్తి కావడం లేదో అన్నను అడిగే పని వదిలేసి, తెలంగాణలో చిలక జోస్యం తనకు తానే చెప్పుకొంటోంది. తెలంగాణలో ఎవరూ మెచ్చని, నచ్చని రాజకీయాలు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి కేసిఆర్‌ కుటుంబం మీద పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తోంది. ఐదేళ్ల కాలం పాటు తెలంగాణలో ఒక్క చెరువు కట్టకు కూడా నిధులు ఇవ్వని వైఎస్‌. రాజశేఖరెడ్డి కూతురొచ్చి, కాళేశ్వరం మీద మాట్లాడే అర్హత వుందా? షర్మిలను తెలంగాణ జనం చీకొడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాంతం భూకంపాలకు ఆస్కారమందా? అసలు తెలంగాణ ప్రాంత నైసర్గిక స్వరూపం గురించి చదువుకొని మాట్లాడు…తెల్లారి లేస్తే భూమి కంపిస్తోందని జనం ఇళ్ల నుంచి పరుగులు పెట్టే ప్రకాశం జిల్లాలో రాజధాని రావాలని కోరుకున్నది జగన్‌…తాను అనుకున్న ప్రాంతలో రాజధాని నిర్మాణం జరగలేదని విశాఖకు మార్చేందుకు సిద్దమౌతున్న జగన్‌కు నిలదీయాల్సిన షర్మిల ఇక్కడ నీతులు చెబుతోంది. జనం ఉసరు తీసేందుకు కారణమౌతున్న జగన్‌ను రాజకీయాన్ని ప్రశ్నించు? అప్పట్లో డిల్లీ నుంచి దేవగిరికి, దేవగిరిని నుంచి డిల్లీకి మార్చినట్లు ఆంధ్రప్రదేశ్‌లో వుంది పాలన. దాని సంగతి చూడు…? తెలంగాణ రాజకీయాలపై షర్మిల కపట ప్రేమ అందరికీ తెలిసిందే!! ఒక్కసారి కాకతీయ కాలువ చూడు…దానిలో పారుతున్న నీరు చూడు…ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాకతీయకాలువ ఎండబెట్టేవారు…కనీసం నీళ్లు వదిలేవారు కాదు…కాని ఇప్పుడు నిత్యం నిండుకుండలా పారుతుంది. ఏడాది పొడవునా, నిండుగా నీళ్లు మోసుకెళ్తోంది. 9700 క్యూసెక్కుల వ్రాహ సామర్ధ్యంతో కాళేశ్వరం నీళ్లుతో గళగళ సవ్వడులు దుంకుతున్నాయి. కాలువ పొడవునా వున్న పొలాలకు అవసరమైన నీరు నేరుగా రైతులు వాడుకునే అవకాశం కల్గింది. 289కిలోమీట్ల పొడవుతో కాళేశ్వరం నీళ్లు మోసుకుపోతోంది. తెలంగాణ మొత్తం సస్యశ్యామలమౌతోంది. ఇదే కాళేశ్వరం నీళ్లు…నిజాలు..ఇదీ తెలంగాణ సాధించిన విజయాలు..ముఖ్యమంత్రి కేసిఆర్‌ కలలుగన్న బంగారుతెలంగాణ ఆవిష్కారాలు…రైతన్నల జీవితాల్లో వెలుగులు…పాలన అంటే ఇదీ…ప్రజల సంక్షేమం అంటే ఇది! షర్మిల ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *