చివరి గింజ అమ్ముడయ్యేనా….?

-ముగిసిన ప్రభుత్వ రెండవ గడువు
-కొనుగోలు కేంద్రాల్లో భారీగా మిగిలిన ధాన్యం -ముంచుకొస్తున్న వర్షాల ముప్పు
-కొనుగోలు కేంద్రాల తీరుతో రైతుల అవస్థలు
-ప్రారంభం చేసి ముఖం చాటేసిన మంత్రులు
-ధాన్యం కొనుగోలు జాప్యంతో సిరిసిల్లలో రైతు ఆత్మహత్యాయత్నం -రాష్ట్రవ్యాప్తంగా రైతుల దయనీయ పరిస్థితి హైదరాబాద్,నేటి ధాత్రి: రైతుల సంక్షేమం కోరకు పాటుపడుతున్నామని గొప్పలు చెప్పుకునే నాయకులు రైతులకు ధాన్యం అమ్మకాల్లో అవసరమైన కనీస సౌకర్యాలను విఫలమయ్యారు. కరోనా పరిస్థితిలోనూ వేల కోట్ల రూపాయలు వెచ్చించి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని గొప్పలు చెపుకున్న నాయకులు నేడు రైతులకు మొఖం చాటేసారు.రాష్ట్రంలో చేపట్టిన ధాన్యం కొనుగోల్లు పూర్తిస్థాయిలో ముగింపు దశకు రాలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ రైతుల కోరిక మేరకు మే 31 వరకు ఉన్న గడువును జూన్ 8 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వర్షాలు పడే అవకాశం ఉండడంతో త్వరగా కొనుగోలు కేంద్రాల్లో అమ్మకాలు ముగిసే చర్యలు తీసుకోవాలని రైతులు ఈ దిశగా ప్రయత్నాలు చేసుకుని త్వరిగతిన అమ్మకాలు ముగించుకోవాలని కోరిన విషయం విదితమే ఈ గడువు నేటితో ముగుస్తున్నప్పటికి కొనుగోలు కేంద్రాల్లో వందల క్వింటాళ్ళ ధాన్యం మిగిలే ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంభందించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రజా ప్రతినిధి కూడా సందర్శించి అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో చోరవ తీసుకోకపోవడం రాష్ట్ర రైతాంగంలో తీవ్ర నిరాశ నెలకొంది.అడపదడప కురుస్తున్న అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు కాకపోవడంతో గడువు పూర్తయిన క్రమంలో మిగిలిన ఉన్న ధాన్యంను ఎక్కడ అమ్ముకోవాలి దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం కొనుగోళ్లకు సంబంధించి ప్రారంభాలు మినహా రవాణా సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విస్మరించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
(రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితిపై పూర్తి కథనం ఈ రోజు మీ నేటిధాత్రిలో…)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here