ఒకే రోజు 199 కరోనా కేసులు నమోదు
-జీహెచ్ఎంసీలో మోగుతున్న కరోనా ప్రమాద గంటికలు
-24 గంటల్లో 5 గురి మృతి
రాష్ట్రంలో 2,698కి చేరిన కేసులు
-రాష్ట్రంలో కర్ఫ్యూ భారీ సడలింపు
హైదరాబాద్: తెలంగాణలో అమాంతం రికార్డు బద్దలు కొట్టే కేసులు నమోదయ్యాయి.ఆదివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన హెల్త్ బులేటిన్ ప్రకారం కొత్తగా 199 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
జీహెచ్ఎంసీ పరిధిలోనే ఒక్కరోజే 122 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో రాజధాని ప్రాంతంలో కరోనా ప్రమాద గంటికలు మరింత అధికమయ్యాయి. రంగారెడ్డిలో 40, మేడ్చల్‌లో 10, ఖమ్మంలో 9, మహబూబ్‌నగర్, జగిత్యాల, మెదక్‌లో 3 చొప్పున కరోనా కేసులు నమోదు కాగా వరంగల్ అర్బన్‌లో 2, సూర్యాపేట, నిర్మల్, యాదాద్రి, జనగాంలో ఒక్కో కేసు నమోదు అయింది. కొత్తగా ముగ్గురు వలస కార్మికులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇప్పటివరకూ 2,698 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1428 మంది డిశ్చార్జ్ అయ్యారు. 1,188 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఈ రోజు కరోనాతో ఐదుగురు మృతి చెందారు. ఇప్పటివరకూ మొత్తం 82 మంది మృతి చెందారు. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ అధికారులు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు.