పెద్దల పేకాట కేంద్రం పై టాస్క్ ఫోర్స్ దాడి

భారీ నగదు వాహనాలు మొబైల్ సీజ్

కేసు నమోదు చేసిన పోలీసులు

వరంగల్ సిటి నేటిధాత్రి

వరంగల్ నగరంలో ఓ ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో పేకాట  ఆడుతున్న పలువురు బడా వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు వరంగల్ టాస్క్ఫోర్స్ అదికారులు పక్కా సమాచారం మేరకు ఈ దాడి జరిగినట్టు తెలుస్తుంది కేయు పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యారణ్యపురి లో ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో పేకాట  అడుతుండగా టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేసి వారి వాహనాలతో పాటు 2 లక్షల 78 వేల 990 రూపాయలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు విద్యారణ్యపురి లో నివాసం ఉంటున్న వ్యక్తి ఓ అధికార పార్టీ నాయకుడి సోదరుడు కావటం వలన పోలీసులు కేసు నమోదు చేయటంలో సంకోచించినా ఆ తరువాత పూర్తి వివరాలు సేకరించి వారి పై చట్ట పరమైన కేసులు నమోదు చేసినట్టు తెలిసింది

*బడా వ్యాపారులు వీరే*

బాలసముద్రం కి చెందిన చకిలం వేణుగోపాల్, పోచమ్మ మైదానం కి చెందిన బంగారు దుకాణం యజమాని బజ్జూరు విక్కీ,విద్యారణ్యపురి గండ్ర భూపాల్ రెడ్డి, 100 ఫీట్ల రోడ్డు గండ్ర సుధాకర్ రెడ్డి హంటర్ రోడ్డు నివాసి సెంక్య నరసింహారెడ్డి మట్టవాడ కు చెందిన అల్లూరి విజయ్ కుమార్,విద్యారణ్యపురి వాసి పెరల కనకయ్య లను అదుపులోకి తీసుకొని మూడు వాహనాలు ఒక ద్విచక్ర వాహనము 7 మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here