ఇంకెన్నాళీ వెట్టి వెతలు..!

108

ఇంకెన్నాళీ వెట్టి వెతలు..!

వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిధిలోని ప్రభుత్వ బడులైనటువంటి యుపిఎస్‌, సిపిఎస్‌, హైసూళ్లలో పనిచేస్తున్న స్పీపర్లు వెట్టిచాకిరిలో ముగ్గతున్నారు. చాలీచాలని వేతనాలతో పనిచేస్తు కుటుంబపోషణ భారంగా మారి దుర్భరపరిస్థితులను ఎదుర్కొంటున్నారు. జీఓ నెంబర్‌ 14 ప్రకారం వేతనాలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ అమలుకు మాత్రం నోచుకోవటం లేదు. ఇచ్చేదే అరకొర వేతనాలు అందులోనూ నెలల రబడి పెండింగ్‌లో పెడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పెండింగ్‌లోని వేతనాలు చెల్లించాలని, శ్రమకు తగ్గి వేతనాలు చెల్లించాలని వేడుకుంటున్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో టిఆర్‌ఎస్‌కెవి జిల్లా అధ్యక్షులు గోనె యువరాజ్‌ నేతృత్వంలో వినతిపత్రం అందించారు.

వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిధిలోని ప్రభుత్వ స్కూళ్లల్లో సుమారు 600మంది స్పీపర్లుగా పని చేస్తున్నారు. వీరికి కేవలం రూ.2వేల నుంచి రూ.2500 మించని వేతనం మాత్రమే ఇస్తున్నారు. అయియి ఇందులోనూ కోతలు పెడుతున్నారని స్పీపర్లు ఆవేదన చెందుతున్నారు. 2019 జూన్‌ నుంచి అక్టోబర్‌ మాసం వరకు బడ్జెట్‌ వచ్చినప్పటికీ కేవలం జూన్‌ నెల వేతనం మాత్రమే ఇస్తామని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చెప్తున్నారని పలువురు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఇక వేసవిలో పని చేసిన 2నెలల వేతనాలకు ఎగనామం పెడుతున్నట్లు టిఆర్‌ఎస్‌కెవి జిల్లా అధ్యక్షులు గోనె యువరాజు పేర్కొన్నారు. అయితే పెండింగ్‌ వేతనాల వివరాలను ఇవ్వాలని 2018లోనే ప్రభుత్వం విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారులు మాత్రం అలసత్వంగా వ్యవహరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఫలితంగా స్పీపర్ల శ్రమకు ఎసరు వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లలో పని చేస్తున్న స్పీపర్ల వేతలు పట్టించుకోవాలని జీఓ నెంబర్‌ 14 ప్రకారం వేతనాలు ఇవ్వాలని, పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని, స్పీపర్లు కోరుతున్నారు.

స్పీపర్ల సమస్యలు పరిష్కరించాలి :

గోనె యువరాజు, టిఆర్‌ఎస్‌కెవి జిల్లా అధ్యక్షులు

జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న స్పీపర్ల సమస్యలు పరిష్కరించాలి. పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలి. జీఓ 14ను స్పీపర్లకు వర్తింపచేయాలి. బ్యాంక్‌ఖాతాల ద్వారా వేతనాలు చెల్లించాలి. పని చేసిన కాలంలోని వేతనాలు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టడం సరైంది కాదు. వేసవిలోనూ పని చేయిుంకొని వేతనాలకు ఎగనామం పెట్టె చర్యలను విరమించుకోవాలి. జిల్లా కలెక్టర్‌ చొరవతీసుకోవాలి. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నిర్లక్ష్యం వీడాలి. విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించాలి. నిర్లక్ష్యం చేస్తే దశలవారి ఆందోళనలు చేయటానికి సిద్దం.