న్యాయం కావాలి..!

129

న్యాయం కావాలి..!

మూడు నెలలుగా కుల బహిష్కరణకు గురైన కుటుంబం న్యాయం కోసం వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. మత్స్యసహాకార సొసైటీ నుంచి ప్రభుత్వం అంధించిన సహారం విషయంలో అప్పనంగా బాధితకుటుంబం నుంచి రూ.90వేలు కులం కట్టుబాట్లపేరుతో లాక్కోవటమే కాకుండా, మరో రూ.50వేలు కులానికి ఇవ్వకుంటే కులం నుంచి బహిష్కరించిన ఘనట ఆలస్యంగా వరంగల్‌ రూరల్‌ జిల్లా నల్లబెల్లి మండలం శనిగరం గ్రామంలో వెలుగుచూసని విషయం తెలిసిందే. నేటిధాత్రి వెలుగులోకి తెచ్చిన ఘటనతో స్థానికంగా అధికారులు సైతం దృష్టిసారించినట్లు తెలుస్తోంది. అయితే మత్స్యసహాకార సొసైటి సభ్యుత్వాన్ని తొలగిస్తున్నట్లు చెప్పి కులం నుంచి బహిష్కరించిన ఘటనతో బాధిత నీలం సమ్మాలు కుటుంబం గత మూడు నెలలుగా మనోవేదనకు గురవుతూనే ఉన్నారు. ఇట్టి విషయంలో స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు సైతం ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని బాధిత కుటుంబం ఆవేతన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎట్టకేలకు నేటిధాత్రి కథనం ద్వారా వెలుగుచూసని కులబహిష్కరణ ఉదాంతంపై అధికారులు చర్యలకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. కులబహిష్కరణ చేయటంతో పాటు గ్రామంలో కులబహిష్కరణ నిర్ణయాన్ని ఎవరూ దిక్కరించవద్దని ఆంక్షలు పెట్టె చర్యలకు పాల్పడిన నీలం సుధాకర్‌, బోయిని రాజు, డ్యాగల రమేష్‌, నీలం రవి, దండు శ్రీనుల వ్యవహారశైలి మరింత కృంగదీస్తున్నట్లు బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇట్టి కులబహిష్కరణ ఘటనపై సమగ్రవిచారణ జరిపి న్యాయం చేయాలని సోమవారం కలెక్టర్‌ను కోరారు. బాధితుల గోడు విన్న కలెక్టర్‌ స్పందించారు. రెండు రోజుల్లో ఆర్డీఓ స్థాయిలో సమగ్రవిచారణ చేస్తామని అన్నారు. సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తానని, న్యాయం చేస్తానని బాధితులకు కలెక్టర్‌ భరోసానిచ్చారు.