పనిచేయని రిజిస్ట్రేషన్‌ అధికారుల ఫోన్‌ నెంబర్లు

59

పనిచేయని రిజిస్ట్రేషన్‌ అధికారుల ఫోన్‌ నెంబర్లు

వరంగల్‌ అర్బన్‌జిల్లా రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో పనిచేసే ముఖ్య పరిపాలన అధికారుల ఫోన్‌ నెంబర్లు పనిచేయడం లేదని, సమాచార హక్కు చట్టం-2005 ప్రకారం రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో సమాచారం కోరిన ఫిర్యాదుదారుడు సమాచారం ఎప్పుడు ఇస్తారోనని తెలుసుకునేందుకు కార్యాలయం ఆవరణంలో బోర్డుపై అధికారుల పేర్లు, ఫోన్‌నెంబర్లు రాసిఉన్న వాటికి ఫోన్‌చేస్తే ఏ ఒక్కటి కూడా పనిచేయడంలేదని ఫిర్యాదుదారుడు తెలిపారు. పేరుకే అదికారుల ఫోన్‌నెంబర్లు రాశారని వాటిలో ఒక్కటి పనిచేయకపోవడం విడ్డూరంగా ఉందని తెలిపారు. అధికారలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, వ్యక్తిగత ఫోన్‌ల మీదఉన్న ద్యాస ప్రభుత్వం అందించిన నెంబర్లపైన ఎందుకు లేదనా ఆయన ప్రశ్నించారు. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ప్రజలకు ఎలా సేవలు అందిస్తారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో సామాన్యులకు చుక్కలు చూపెడుతున్నారని, పలుకుబడి ఉన్నోళ్లకే పనులు చకచకా అజరుగుతున్నాయని ఫిర్యాదుదారుడు తెలపిడు.