నాపై జరిగేదంతా దుష్ప్రచారమే  

116
నాపై జరిగేదంతా దుష్ప్రచారమే
శుక్రవారం నేటిధాత్రి పత్రికలో ప్రచురితమైన ‘ట్రాఫిక్‌లోకి భళ్ళాలదేవుడు’ కథనంపై ఎస్‌బి సిఐ పుల్యాల కిషన్‌ వివరణ ఇచ్చారు. తనపై తప్పుడు ప్రచారం చేయటం కొంతమంది పనిగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. విధినిర్వహణలో భాగంగా చేపట్టిన చర్యలు చట్టపరమైన చట్టపరమైనవిగానే నిర్వహించానని తెలిపారు. హసన్‌పర్తి సిఐగా విధులు నిర్వహిచిన కాలంలో పలు కేసుల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించానని అన్నారు. పలు గ్రామాల్లో ప్రజలతో మమేకమయ్యానని వివరించాను. శాంతిభద్రతలను కాపాడేందుకు కృషి చేశానని అన్నారు. కిందిస్థాయి నుంచి అట్టడుగు సామాజిక వర్గం నుంచి కష్టపడి వచ్చిన తనకు ప్రజల కష్టసుఖాలు తెలుసునని  తెలిపారు. ప్రజలతో ఎలా మెలుగాలో తెలిసిన వ్యక్తిని అని, హసన్‌పర్తిలో పని చేసినప్పుడు తను చేసిన పనులను ప్రజలు ఎప్పటికీ గుర్తించుకునే విధంగా అన్నివిధాలా పని చేశానన్నారు.సిసి కెమెరాలు అన్ని గ్రామల్లో పెట్టించానని సిసి కెమెరాల కోసం ఏ ఒక్క గ్రామంలో కూడా వసూళ్లు చేయలేదని పేర్కొన్నారు. క్రషర్లు, బెల్టుషాపుల యజమానులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయలేదని తెలిపారు. ప్రజల కష్టసుఖాలు తెలిసినవానిగా వారిని అన్ని విధాల చైతన్యం చేయటానికి కృషి చేశానని తెలిపారు. పలు కేసుల్లో స్టేషన్‌కు వచ్చిన బాధితులను తన సొంతవారిగా చూసుకొని పరిష్కారమార్గాలను చూపానని అన్నారు. ఏ ఒక్కరి దగ్గక కూడా ముడుపుల రూపంలో తీసుకోలేదని అన్నారు. కొంత మందిని అదుపు చేయటానికి తీసుకున్న చర్యలకు అక్కసుపెంచుకున్న వారున్నారని, వారే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో హసన్‌పర్తిలో సిఐగా పని చేసనప్పటి నుంచే కొంత మంది తనపై తప్పుడు ప్రచారం చేయటం జరుగుతుందని దీనినే ప్రస్తుతం కొనసాగిస్తున్నారని అన్నారు. తనకు ట్రాఫిక్‌ సిఐగా వచ్చే ఉద్ధేశ్యమే లేదన్నారు. తను సిపి దగ్గర ఎలాంటి రాయబారాలు చేయటం లేదని ప్రత్యేకంగా ట్రాఫిక్‌లోకి వచ్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయటం లేదని అన్నారు. తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. ఇలాంటి వార్త కథనాలను నమ్మవద్దని పేర్కొన్నారు. కొంతమంది పని కట్టుకొని చేస్తున్న ఆరోపణల ప్రచారాన్ని ఆయన కండించారు. తను ఎప్పుడూ నీతినిజాయితీలకు కట్టుబడి ఉంటానని, ప్రజలకు నిజాయితీలో సేవలందిస్తానని, పోలీసు సేవకుడిగానే ఉంటానని, చట్టానికి లోబడి విధులు నిర్వహించే వ్యక్తినని ఎస్‌బి సిఐ పుల్యాల కిషన్‌ పేర్కొన్నారు.