బెల్‌ బ్రాండ్‌ యజమాని బోర్‌ సీజ్‌

బెల్‌ బ్రాండ్‌ యజమాని బోర్‌ సీజ్‌

గీసుగొండ మండలం గొర్రెకుంట గ్రామంలోని వీరాయిచెరువు శిఖం భూమిలో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా వేసిన బోరును రెవెన్యూ అధికారులు శుక్రవారం సీజ్‌ చేశారు. బెల్‌ బ్రాండ్‌ యజమాని సామ్యెల్‌ తమ గ్రామంలోని చెరువుశిఖం భూమిని కబ్జాచేసి అక్రమంగా బోరు వేశాడని, గ్రామంలోని యువకులు కొంతమంది రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని చెరువును అక్రమంగా కబ్జాచేసి ఇది తన పట్టాభూమి అంటూ సామ్యెల్‌ గతకొద్ది సంవత్సరాలుగా గ్రామస్తులను నమ్మిస్తూ వస్తున్నాడని, నిజానికి వీరాయిచెరువు 8ఎకరాల 38గుంటల విస్తీర్ణంలో ఉంది. అయితే సామ్యెల్‌ తనకు 8ఎకరాల పట్టా ఉందని చెరువును చూపిస్తూ వస్తున్నారని యువకులు ఆరోపించారు. సామ్యెల్‌కు 8ఎకరాల పట్టా చెరువు వద్దే ఉంటే మరీ చెరువు ఎక్కడపోయిందని వారు ప్రశ్నిస్తున్నారు. వీరాయి చెరువు 8ఎకరాల 38గుంటల విస్తీర్ణాన్ని కలిగి ఉన్న అది తనదే అంటున్న సామ్యెల్‌ మూడునెలల క్రితం గొర్రెకుంట గ్రామస్తులకు సురక్షిత మంచినీటిని అందించే ప్రభుత్వ బావి, బోర్‌వెల్‌ల మధ్య అతనో బోర్‌ వేయించాడు. దీంతో గ్రామ యువకులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న రెవెన్యూ అధికారులు శుక్రవారం ఉదయం అక్రమంగా వేసిన బోర్‌ను సీజ్‌ చేశారు. ఆర్‌ఐ అర్జున్‌, విఆర్వో అక్రంలు బోర్‌ వేసిన ప్రాంతానికి వెళ్లి గ్రామ యువకుల సమక్షంలో పంచనామా నిర్వహించి బోర్‌ సీజ్‌ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా బోర్‌ వేస్తే సీజ్‌ తప్పదని ఈ సందర్భంగా ఆర్‌ఐ అర్జున్‌ హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here