ట్రాఫిక్‌లోకి ‘భళ్ళాలదేవుడు’…?

‘రాజ్యాన్ని చేజిక్కించుకోవటానికి ‘భళ్ళాలదేవుడు’ ఎన్ని కుయూక్తులు చేశాడో ‘బహుబలి’ సినిమాలో మనం చూశాం’ అది సినిమా కథే అయినప్పటికీ సరిగ్గా ఆ కథలాగే భళ్ళాలదేవుని పాత్రను గుర్తుచేసే విధంగా ఓ పోలీస్‌ అధికారి వ్యవహరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో హసన్‌పర్తి సిఐగా విధులు నిర్వహించిన అధికారి ప్రస్తుతం స్పెషన్‌ బ్రాంచీలో కొనసాగుతూ ట్రాఫిక్‌ సిఐ పోస్టింగ్‌పై కన్నేశారని తెలుస్తోంది. దండాలతో దండుకోవటం, సమ్మగా సరీచప్పుడు కాకుండా అందినకాడికి ఆరగించటం, సెటిల్‌మెంట్లు చేయటం ఆయన నైజం అంటూ భళ్ళాలదేవుని పాత్రను తలపించే ఆ అధికారి గురించి కథలు కథలుగా చెప్పుకోవటం బహిరంగరహస్యమే అనేది గమనార్హం.

‘తిరుపతి దేవుని దర్శనానికి వెళ్లిన భక్తులు ఎలాగైతే మొక్కులు చెల్లిస్తారో… సమస్య ఉందని పిర్యాదు చేయటానికి వెళ్లిన బాధితులు సైతం ఇతగాడికి మొక్కుల రూపంలో ముడుపులు చెల్లించాల్సిందేనని పలువురు వాఖ్యానిస్తుంటారు. దేవునికి మొక్కులు చెల్లించటం దైవభక్తి. ఈ అధికారికి మొక్కుల రూపంలో ముడుపులు చెల్లించటం ఖాకీ భక్తిగా ఉండేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. హసన్‌పర్తి సిఐగా విధులు నిర్వహించిన కాలంలో సెటిల్‌మెంట్లు చేయటం, ఫిర్యాదుదారునితో సంబంధం లేకుండానే న్యాయఅన్యాయాలను నిర్ణయించటం, భయం భక్తి అన్నీ మేలవించి తనకు అనుకూలంగా మార్చుకోవటం ఆ అధికారికి వెన్నతో పెట్టిన విద్యగా ఉండేదని తెలుస్తోంది. హసన్‌పర్తిలో విధులు నిర్వహించిన సమయంలో సుమారు 407 కేసులు నమోదైతే ఇందులో 70కిపైగా సెటిల్‌మెంట్లు చేసి తనకు అనుకూలంగా మార్చుకున్నారనే అరోపణలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదు చేయటానికి వెళ్లినవారిని సైతం వదలకుండా దండుకున్నాడనే ప్రచారం ఉంది. వీటన్నింటి నేపధ్యంలో హసన్‌పర్తి సిఐ బాధ్యతల నుంచి స్పెషల్‌బ్రాంచీకి మార్చడంతో ధన్యవాదాలతో దండుకోవటానికి కొంత బ్రెక్‌పడ్డట్లు అయిందని, దీంతో పలు చోట్ల సిఐగా వెళ్లటానికి తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు గతంలో ప్రచారం జోరుగా సాగిన విషయం గమనార్హం. కేయూ, ధర్మసాగర్‌ సిఐ పోస్టింగ్‌లపై కన్నేసినప్పటికీ ప్రయత్నాలు విఫలం కావటంతో ప్రస్తుతం హన్మకొండ ట్రాఫిక్‌ సిఐ పోస్టింగ్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. అయితే హసన్‌పర్తి స్మార్టు పోలీస్‌స్టేషన్‌ పేరుతో స్మార్ట్‌గానే తన పద్దతులు కూడా ఉండేవని పలువురు కథలు కథలుగా చేప్పుకోవటం గమనార్హం. ఇక పలు గ్రామాల్లో సిసి కెమెరాల పేరుతో ఆయా గ్రామాల్లో దండిగానే వసూళ్లు చేసినట్లు ఆరోపనలు బలంగానే వినిపిస్తున్నాయి. సీతంపేట, గండ్రుపల్లి, పెంబర్తి, మడిపల్లి తదితర గ్రామాల్లో సిసి కెమెరాలు పరిస్థితి ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోందని తెలుస్తోంది. సీతంపేట లాంటి చోట ఒకటి కూడా పెట్టకపోవటం గమనార్హం. అయితే సిసి కెమెరాల పేరుతో మాత్రం ప్రతిగ్రామంలో వసూళ్లు చేశారని, కొన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపిటీసీలు, ముఖ్యంగా బెల్టుషాపులు, రైసుమిల్లులు, ఇసుక డంపుల వద్ద సిసి కెమెరాల పేరుతో వసూళ్లు చేసి వసూళ్లకనుగుణంగా పనులు చేయలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బదిలీల్లో భాగంగా గతంలో స్పేషల్‌బ్రాంచీకి వెళ్లిన అధికారికి రెక్కలు విరిగిన రాజుగా పరిస్థితి మారటంతో మళ్లీ యథాస్థితిలోకి రావటానికి ప్రయత్నాలు చేశారు. గతంలో కేయు, ధర్మసాగర్‌కు చేసిన ప్రయత్నాలు విఫలం కావటంతో హన్మకొండ ట్రాఫిక్‌పై కన్నేసి ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతగాని వ్యవహారం ఓ కేసు విషయంలో డిజిపి వరకు బాధితుడు వెళ్లిన ఉదంతాలు కూడా ఉన్నాయని ఇవన్నీ తెలిసిన పోలీస్‌బాస్‌ దగ్గర ఈ ఘనుడి పోస్టింగ్‌ ప్రయత్నాలు అంతగా ఫలించడం లేదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ భళ్ళాలదేవుడి లాంటి అధికారి హన్మకొండ ట్రాఫిక్‌ పోస్టింగ్‌ కోసం పోలీస్‌బాస్‌ దగ్గర చేస్తున్న ప్రయత్నాలు ఎలా ఉంటాయో…అన్ని తెలిసిన పోలీస్‌బాస్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here