పింగిళి కాలేజీలో…తోడుదొంగలు..!

పింగిళి కాలేజీలో…తోడుదొంగలు..!

రాస్తే రామాయణం..చెప్తే మహాభారతం అన్న విదంగా పింగిళి కాలేజీలో జరిగిన క్యాంపు అవినీతి వ్యవహారం రోజురోజుకు మలుపులు తిరుగుతున్నది. ఎంతో హుందాగా వ్యవహరించాల్సిన పింగిళి కళాశాల ప్రిన్సిపాల్‌ దొంగలతో జతకట్టి అవినీతి దందాకు తెరలేపిన విషయం ప్రస్తుతం ప్రతిఒక్కరిని తలదించుకునే పరిస్థితికి తీసుకువచ్చారు. తప్పుచేస్తే సరిచేయాల్సిన ప్రిన్సిపాల్‌ దొంగకు దొంగబిల్లులపై దర్జాగా సంతకాలు చేయడమేంటో ఎవ్వరికి అర్ధం కాకుండాపోయింది. అంతుచిక్కని ప్రశ్నలతో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. సమ్మయ్య ఓ వైపు కాలేజీ అటెండెన్స్‌ రిజిష్టర్‌లో రోజు సంతకాలుచేసినా, క్యాంపులో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేశాడని ఎం.సమ్మయ్య సృష్టించుకున్న దొంగబిల్లులపై ప్రిన్సిపాల్‌ ఎలా సంతకాలు చేసిందో, ఎందుకు చేసిందో అర్ధం కావడంలేదు. సమ్మయ్య ప్రిన్సిపాల్‌కు వాటా ఇస్తానని చెబితే సంతకం చేసిందా? ఇంకేమైనా లోపాయికారి ఒప్పందాలతో సంతకాలు చేసిందా? అన్నవి ప్రస్తుతం ప్రతిఒక్కరిని వెంటాడుతున్న ప్రశ్నలు.

వాటర్‌ బిల్‌ 82వేల 300రూపాయలు..?

క్యాంపులో సమ్యయ్య పరిస్థితి ఇలా ఉంటే, క్యాంపులో పనిచేసినవారికి కేవలం త్రాగడానికే తేది.04-18-2019 నాటికి 82వేల 300రూపాయల వాటర్‌ త్రాగారని బిల్లుపెట్టారు.

ఇక తేది.03-30-2019న ట్రాన్స్‌ఫోర్ట్‌, పర్‌చేస్‌ ఆఫ్‌ సానిటరీ గూడ్స్‌ పేరు మీద 70వేల రూపాయలు, తేది.03-30-2019న శ్రీ వినాయక ట్రేడర్స్‌కి 31వేల 500రూపాయలు, తేది.04-25-2019న క్యాంపులో పనిచేసిన భాయ్స్‌కు 14లక్షల 85వేల 522రూపాయలు చెల్లించినట్టు అంకెలగారఢీ మాయచేసి బిల్లులు పెట్టారు.ఇవన్ని కూడా ఏఫ్రిల్‌ నెలవరకే పెట్టినబిల్లులు. ఇంకా మే,జూన్‌ నెలలో ఎంతెంత ఎన్ని లక్షల రూపాయలు పక్కదారిపట్టాయో ఊహించుకుంటే కళ్లు బైర్లుకమ్మడం మాత్రం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here