రెవెన్యూశాఖపై కలెక్టర్‌ దృష్టి సారించాలి

వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని వెరెన్యూ సిబ్బంది పనితీరుపై జిల్లా కలెక్టర్‌ ప్రత్యేకమైన దృష్టి సారించాల్సిన అవసరముంది. తహాశీల్థార్‌లతో పాటు పలుచోట్ల వీఆర్వోలు భూరికార్డుల ప్రక్షాళనలో అవకతవకలకు పాల్పడినన విషయం బహిరంగ రహస్యంగా మారింది. శాయంపేట మండలంలోని తహాశీల్ధార్‌ ఏకంగా మండలంలోని గోవిందాపూర్‌ గ్రామానికి చెందిన ముప్పు శ్రీశైలంకు సంబంధించిన వారసత్వ భూమిని స్థానికి ఎమ్మెల్యే సోదరుని కుమారుడైన గండ్ర అవినాష్‌రెడ్డి పేరున పట్టాపాస్‌బుక్స్‌ ఇవ్వటం, పానిలోకి ఎక్కించి ఆన్‌లైన్‌లో పొందుపరిచే చర్యలు వెలుగుచూడటం రెవెన్యూ సిబ్బంది ఘనకార్యానికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఎమ్మెల్యే దంపతుల ఆశీస్సులతో తహాశీల్థర్‌ ఇష్టానుసారంగా వ్యవహరించటమే కాకుండా తనను అడిగేనాధుడే లేడన్నట్లుగా షీకారు బాగోతం నిర్వాహకానికి పాల్పడిన ఉదాంతం వెలుగుచూసిన విషయం తెలిసిందే. అయితే సదరు తహాశీల్థార్‌ పట్ల కనీసం విచారణ కూడా లేకపోవటం రెవెన్యూ ఉన్నతాధికారులను విమర్శల పాలుచేస్తోంది. ఆత్మకూర్‌ మండలంలోనూ భూరికార్డుల ప్రక్షాళనలో జరిగిన అవకతవకలపై తహాశీల్థార్‌ సైతం బహిరంగంగానే సరిచేసుకుంటామని చేప్పటం రెవెన్యూ సిబ్బంది పని తీరు ఎలా ఉందో తేటతెల్లం చేస్తోంది. శాయంపేట, ఆత్మకూర్‌ మండలాల్లోని పలు గ్రామాల రైతులు రెవెన్యూసిబ్బందితో ఏగలేని స్థితిలో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా శాయంపేటలో ఎమ్మెల్యే దంపతులు భూరికార్డుల ప్రక్షాళనలో జరిగిన అవకతవకలు కొన్ని వారి కనుసన్నల్లోనే ఉన్నాయని అధికారులు భరోసాతో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి సారించి శాయంపేట తహాశీల్థార్‌ పనితీరుతో పాటు షీకారు బాగోతంపై సమగ్రవిచారణ జరుపాలని, ఆత్మకూర్‌ రెవెన్యూ సిబ్బంది పనితీరు పట్ల దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here