కంప్యూటర్‌ ఆపరేటర్‌కు…రూ.76వేల..500లు?

కంప్యూటర్‌ ఆపరేటర్‌కు…రూ.76వేల..500లు?

వరంగల్‌ అర్బన్‌జిల్లా పింగిళి మహిళ జూనియర్‌ కళాశాలలో నిర్వహించిన ఆర్‌వి ఆర్‌సి క్యాంపులో అదే కళాశాలలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎం.సమ్మయ్య ప్రిన్సిపాల్‌ సహకారంతో ఇష్టారాజ్యంగా దొంగబిల్లులుపెట్టి లక్షల రూపాయలు అప్పనంగా నొక్కేశాడు. సమ్మయ్య సమీప బంధువైన ఎం.సిద్ధార్థ అకౌంట్‌లో క్యాంపు అకౌంట్‌నెంబర్‌ 0210102000015400 నుండి తేది.15-06-2019న ఎం.సిద్ధార్థ అకౌంట్‌నెంబర్‌ 286710100013214 కు క్యాంపులో కంప్యూటర్‌ అపరేటర్‌గా పనిచేశాడని అక్షరాల రూ.76వేల 500రూపాయలు ఎం.సిద్ధార్థ అకౌంట్‌లో వేశారు. వాస్తవానికి ఎం.సిద్ధార్థ డ్రైవర్‌గా పనిచేస్తాడని తెలుస్తున్నది. సిద్ధార్థ ఎం.సమ్మయ్యకు సమీపబంధవు అయినందునే సమ్మయ్య తన పలుకుబడిని ఉపయోగించి సిద్ధార్థకు కంప్యూటర్‌ ఆపరేటర్‌ లిస్టులో తన పేరునుపెట్టి డబ్బులువేశారు. స్టేషనరీ పేరుతో సుతిల్‌ దారాలకు సుమారు రూ.57వేల రూపాయలు, క్యాంపులో ఎండాకాలంలో వేడిమిని తట్టుకోవడానికి క్యాంపులో పనిచేస్తున్నవారికి చల్లని గాలిని అందించడం కోసం కూలర్లు పెట్టామని లక్షకు పైగా బిల్లుపెట్టారని సమాచారం.

డిఐఈవోలో అకౌంటెంట్‌ ఇష్టారాజ్యం..!

డిఐఈవో కార్యాలయంలో పనిచేసే ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది కూడా క్యాంపులో భాయ్స్‌గా పనిచేశారని తేది.03-05-2019న నైట్‌వాచ్‌మెన్‌గా చెప్పుకుంటున్న ఎస్‌.శివరామ్‌ అకౌంట్‌నెంబర్‌ 62334826505, ఐఎఫ్‌సి కోడ్‌ ఎస్‌బిఐఎన్‌0021788లో రూ.16వేల 653, అటెండర్‌ అయిన ఎమ్‌.హేమలత అకౌంట్‌నెంబర్‌ 62251578664, ఐఎఫ్‌సి కోడ్‌ ఎస్‌బిఐఎన్‌0020303లో రూ.8వేల 113లు, అపీస్‌ సబార్డినేటర్‌గా పనిచేస్తున్న ఎమ్డీ.అస్రఫ్‌ అకౌంట్‌నెంబర్‌ 62217487327, ఐఎఫ్‌సి కోడ్‌ ఎస్‌బిఐఎన్‌ 0020150లో రూ.16వేల 653 రూపాయలు వేశారు. వాస్తవంగా వీరంతా ఆఫీస్‌కు చెందిన వారే అలాంటి వీరికి భాయ్స్‌గా పనిచేశారని తప్పుడు లిస్టులో పేర్లుపెట్టి డబ్బులు జమచేయాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్ధంకాని పరిస్థితి. మరోవైపు డిఐఈవోలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేసే టి.ప్రీతి అకౌంట్‌నెంబర్‌ 62430292286, ఐఎఫ్‌సి కోడ్‌ ఎస్‌బిఐఎన్‌0020886లో తేది.27-05-2019న రూ.12వేల 820లు, మేన్‌ క్యాంపు పర్సనల్‌ పేమెంట్‌ లిస్టులో రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు టి. ప్రీతి అకౌంట్‌నెంబర్‌ 62430292286, ఐఎఫ్‌సి కోడ్‌ ఎస్‌బిఐఎన్‌0020886లో రూ.10వేలు, తేది.10-06-2019న భాయ్స్‌ అండ్‌ కంప్యూటర్‌ లిస్టులో టి.ప్రీతి అకౌంట్‌నెంబర్‌ 62430292286, ఐఎఫ్‌సి కోడ్‌ ఎస్‌బిఐఎన్‌0020886లో రూ.30వేల 768లు ప్రీతి అకౌంట్‌లో డబ్బులు వేసుకున్నారు.ఇలా ఇష్టారాజ్యంగా క్యాంపు డబ్బును తమ వ్యక్తిగత ఖాతాల్లోకి వేసుకొని దండుకున్నారని తెలుస్తున్నది. ఇవే కాకుండా వీరికి సంబందించిన బంధువుల పేర్లను సైతం సేకరించి వారిఅకౌంట్లలల్లో కూడా వేశారని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here