దర్జాగా దగా..తహశీల్థార్‌ మాయ..!

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన రెవెన్యూ సిబ్బందికి వరంగా మారింది. తాత, తండ్రుల నుంచి వారసత్వంగా వస్తున్న భూమిలో ఏండ్ల తరబడి సాగులో ఉన్న రైతు భూమిని అప్పనంగా పంచిపెట్టే చర్యలకు పాల్పడ్డాడు వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండల తహశీల్థార్‌. మండలంలోని పెద్దకోడెపాక రెవెన్యూ గ్రామ పరిధిలోని గోవిందపూర్‌ గ్రామ శివారులోని ముప్పు శ్రీశైలం అనే రెతుకుకు సంబంధించిన వ్యవసాయ భూమిని సరీ చప్పుడు కాకుండా కొంత భాగాన్ని ఇరతుల పేరుతో పట్టాలు చేశారు ఈ తహశీల్థార్‌. ” మాకు వారసత్వంగా సంక్రమిస్తున్న భూమిని మా పేరుతో కాకుండా ఇతరుల పేరుతో ఎలా రికార్డుల్లోకి ఎక్కిస్తారు. మరొకరికి పట్టా ఎలా చేస్తారు. మా భూమిని మా పేరుమీదనే పట్టాపాసుబుక్‌లు ఇవ్వాలని వేడుకున్న రెతు కుటుంబాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా బాధిత కుటుంబానికి చెందిన శ్రీశైల్యం బార్య ముప్పు సంధ్యారాణిని దుర్జాషలాడటంతో గత మార్చి 3వ తేదిన సదరు మహిళా క్రిమిసంహరఖ మందు తాగిన ఉద్దాంతం కూడా ఈ ఘనకార్యుని ఖాతాలో ఉందనేది గమనార్హం.”

వివరాల్లోకి వెళ్లితే గోవిందాపూర్‌కు చెందిన శ్రీశైల్యం అనే రైతుకు తన తాత, తండ్రుల నుంచి (1977 నుంచి ) వారపత్వంగా వస్తున్న వ్యవసాయభూమిని తన పేరు మీద రికార్డుల్లో ఎక్కించాలని తనకు పట్టా చేయాలని ఏండ్ల తరబడి కార్యాలయం చుట్టు తిరుగుతున్న రైతు గోడును అధికారులు ఏమాత్రం పట్టించుకున్న పరిస్థితి లేకపోగా ప్రస్తుత తహశీల్థార్‌ ఏకంగా భూరికార్డుల్లో శ్రీశైలం భూమి పలువురికి పంచబడింది. వారసత్వంగా వస్తున్న సర్వే నెంబర్‌ 635, 638, 637, 731, 738లోని వ్యవసాయభూమిలోని రెండు ఎకరాల భూమి రవీందర్‌రావు పేరుతో, మరో ఎకరం భూమి బొత్త రాజు పేరుతో నమోదై ఉంది. 2010లో బొత్త రాజు పేరుమీద ఉన్న ఎకరంభూమి కూడా ప్రస్తుతం గండ్ర భూపాల్‌రెడ్డి తనయుడు గండ్ర అవినాష్‌రెడ్డి పేరుతో పట్టా చేశారు. ఇట్టి విషయాన్ని పలు మార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పుటికీ ఫలితం లేదనేది గమనార్హం. తప్పుడు సర్వేనెంబర్లు, సంబంధం లేని వ్యక్తులకు పట్టాలు చేయటం, పట్టాపాసుబుక్కులు ఇవ్వటం శాయంపేట మండలంలో భూరికార్డుల ప్రక్షాళన గందరగోళంగా మారిందనటానికి సాక్ష్యంగా నిలుస్తోందనేది గమనార్హం.

పట్టింపులేని అధికారులు…

ఇట్టి విషయంలో న్యాయం చేయాలని కోరుతూ బాధితరైతు ఆర్డీఓకు విన్నవించినా, శాయంపేట పోలీసులను వేడుకున్నప్పటికీ ఎలాంటి చర్యలు లేకపోవటం విమర్శలకు తావిస్తోంది. శాయంపేట తహశీల్థార్‌ లీలలకు ఎమ్మెల్యే, జడ్పీచైర్‌పర్సన్‌ల ఆశీస్సులు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల అండతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు శాయంపేట తహశీల్థార్‌ వ్యవహారంలో సమగ్రవిచారణ జరిపి తగు చర్యలు చేపట్టాల్సి ఉంది.

న్యాయం చేయండి : శ్రీశైలం, బాధిత రైతు

వారసత్వంగా ఉన్న భూమిని పంచిపెట్టే చర్యలకు పాల్పడుతున్నారు. పలువురి పేర్లమీద రికార్డుల్లోకి ఎక్కించారు.ఇదేంటని అడిగితే తహశీల్థార్‌ కనీసం పట్టించుకోకపోగా నా భార్యను దూషించాడు. గత నాలుగు నెలల కింద పురుగులమంది తాగింది. ఈ విషయంలో పోలీసులకు కూడా పిర్యదు చేశాను. నాకు న్యాయం చేయాలని ఆర్డీఓను వేడుకున్నప్పటికీ ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉంది. సాగులో ఉన్న నాభూమిని ఇతరులకు పంచిపెట్టేవిధంగా పలువురి పేర్లమీద రికార్డుల్లో ఎక్కించి పట్టాలు ఇచ్చిన శాయంపేట తహశీల్థార్‌పై విచార జరిపి తగు చర్యలు చేపట్టాలి. నా కుటుంబానికి న్యాయం చేయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here