సిగ్గులేకపోతే సరి…!
సిగ్గులేకపోతే సరి..కనీసం గౌరవాన్ని కాపాడుకోవాలి కదా..? ఆయనేదో ఘనకార్యం చేసినట్లు…రెవెన్యూశాఖకు అదనపు గౌరవాన్ని తెచ్చిపెట్టినట్లు…రాసలీలానందం ‘షీ’కారు బాగోతాన్ని వెనుకేసుకురావటం రెవెన్యూశాఖ స్థాయిని దిగజార్చటం గాక ఏమౌతుంది..? ‘షీ’కారు బాగోతం ఉట్టి పుకారే అనటమంటే రెవెన్యూశాఖలో ఇలాంటి బాగోతాలు సహాజమే అని లైసెన్స్‌ ఇవ్వటం గాక ఏమౌతుంది..? శాయంపేట తహాశీల్థార్‌ ‘షీ’కారు బాగోతాన్ని సమర్థించే వారికి, తహాశీల్థార్‌ను కాపాడే విధంగా అనుకూల నివేదిక తయారుచేసే అధికారులకే తెలియాలి. ఏకంగా జిల్లాలోని నల్లబెల్లి మండల పరిధిలోని బోల్లోనిపల్లి, దేవానగరం శివారులో ‘షీ’కారు బాగోతాన్ని నడిపిన శాయంపేట తహాశీల్థార్‌ రాసలీలా’నందం’ వ్యవహారాన్ని అక్కడి రైతులతో పాటు నల్లబెల్లి పోలీస్‌స్టేషన్‌ హోంగార్డులు ప్రత్యేక్ష్యంగా నిలదీశారనేది బహిరంగ రహస్యంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఇట్టి విషయంలో రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు నివేదికను కోరగా నివేదికను సమర్పించాల్సిన డివిజన్‌ స్థాయి అధికారి మాత్రం తహాశీల్థార్‌ను కాపాడేవిధంగా నివేదికను ఇవ్వటానికి సిద్దపడినట్లు తెలుస్తోంది. దీనికి తోడు అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే సైతం సఫోర్టు పలుకుతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే విచారణాధికారి నివేదికను తహాశీల్థార్‌కు అనుకూలంగా ఇవ్వటానికి సిద్దపడటం వెనుక రహస్యపు ఒప్పందాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేతో పాటు మండల స్థాయి నాయకులు కూడా తహాశీల్థార్‌పై ప్రేమను వలకపోస్తున్నట్లు తెలుస్తోంది.
”అసలు నిజాలతో నివేదిక ఇవ్వాలంటే వీరికి సాక్ష్యాలు కావాలంట…బాగోతం జరిగిన రోజు సదరు తహాశీల్థార్‌ మరో అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నట్లు షీకారు బాగోతంతో తనకేమీ సంబందం లేనట్లుగా నివేదికను సమర్పించేందుకు రంగం సిద్దం చేస్తున్నారంటే ఇంతకంటే పరువుతక్కువ పని ఇంకేమీ ఉంటుందో వారే చెప్పాలి. ఇతగాని బాగోతం నిగ్గు తేల్చాటంటే వీరికి సాక్ష్యాలేమి కావాలో మరి..? అసలు నల్లబెల్లి పోలీస్‌స్టేన్‌లో ఆరోజు జరిగిన బాగోతంపై ఆరా తీశారా..? తీస్తే ఏలాంటి రిపోర్టు వచ్చింది..? పోలీసుల రిపోర్టు ఆధారంగానే నివేదికను తయారు చేస్తున్నారా…? లేక ఎవరేమి అనుకుంటే మాకేమీ సిగ్గు, రెవెన్యూశాఖ పరువు ఎక్కడపోతే మాకేంటి అని తహాశీల్థార్‌ చెప్పినట్లుగానే నివేదికను తయారు చేస్తున్నారా..? అనేది రెవెన్యూశాఖ ఉన్నాధికారులే తేల్చుకోవాలి”.
 షీకారు బాగోతాన్ని ఎమ్మెల్యే స్థాయిలో సమర్థించటం ఎంత వరకు సరైందో ప్రజలు గమనిస్తున్నారనేది ఎమ్మెల్యేతో పాటు స్థానిక నాయకులు గుర్తెరుగాల్సిన అవసరముంది. ఇలాంటి బాగోతంలో సరైన చర్యలు చేపట్టకుంటే రెవెన్యూశాఖ పట్ల ప్రజలకు ఎలాంటి ఆలోచన కలుగుతుందో రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు ఆలోచించాల్సిన అవసరముంది.
ఆ కారు సంగతేంటి..?
టిఎస్‌ 03 ఇజె 7480 నెంబర్‌ గల కారు ఆరోజు ఆయనెందుకు ఉపయోగించారో విచారణలో పేర్కొన్నారా..? ఆ రోజు ఆ సమయంలో ఆ కారుతో అక్కడకెందుకు వెళ్లారు..? అని విచారించారా..? ”ముక్కెకడుందంటే….ముఖమంతా చూపిన” చందంగా కాకుండా ఆ కారుతో తహాశీల్థార్‌ ఆరోజు అక్కడెందుకు ఉన్నారో పోలీసులు, రెవెన్యూశాఖ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి ప్రత్యేకవిచారణ చేపడితే అసలు విషయం బయపడుతుందనేది గమనించాలి. తహాశీల్థార్‌ ఆరోజు ఉపయోగించిన చేపడితే అసలు విషయం తేటతెల్లం అవుతుందని గమనించాల్సిన అవసరముంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here