గంగాధర మాయ-5 నిమ్స్‌ డైరెక్టర్‌ పదవి… నాకే కావాలి..!

గంగాధర మాయ-5

నిమ్స్‌ డైరెక్టర్‌ పదవి…

నాకే కావాలి..!

నిమ్స్‌ డైరెక్టర్‌ పదవికాలం ముగిసింది. కొత్తవారిని నియమించేందుకు ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. అయితే ఇప్పటి వరకు నిమ్స్‌ డైరెక్టర్‌ పదవిలో కొనసాగుతున్న డాక్టర్‌ కందకట్ల మనోహర్‌ ఆ పదవి మళ్లీ తనకే కావాలని పట్టుబడుతున్నాడట. పట్టుబట్టడం అంటే అలాంటి, ఇలాంటి పట్టు కాదు ఎలాగైన మంత్రి ఈటలను ఒప్పించేంతటి పట్టుబడుతున్నాడట. ఒక దశలో తీవ్రస్థాయిలో బ్రతిమిలాడి ఒప్పించే ప్రయత్నం చేశాడట. బాధ్యతాయుతమైన వైద్యవృత్తిలో ఉండి నిమ్స్‌ డైరెక్టర్‌గా సేవలందించిన ఈ డాక్టర్‌ సాబ్‌ ఈటలను బ్రతిమిలాడిన సీన్‌ చూస్తే స్వయంగా చూసిన వాళ్లే షాకయ్యారని సమాచారం. వైద్యవృత్తిలో ఉండి కేవలం ఓ పదవి కోసం మనుషులు ఇంతగా దిగజారిపోతారా…? అనే స్థాయికి మనోహర్‌ పడిపోయాడని వైద్యవర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆగస్టు 28, 2015 సంవత్సరంలో నిమ్స్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ మనోహర్‌ పదవికాలం ముగిసినప్పటికీ ప్రభుత్వం ఆయన పదవిని పొడిగించింది. అయిన ఈ డైరెక్టర్‌కు పదవిపై ఆశ తీరలేదట. మళ్లీ ఈ పదవి తనకే దక్కాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాడట. ఇదే అదనుగా తీసుకున్న ఈటల పేషిలోని టెలిఫోనిక్‌ ఓఎస్డీ గంగాధర్‌ రంగంలోకి దిగాడట. ఈటలను, ముఖ్యమంత్రిని ఒప్పించి తిరిగి ఆ డైరెక్టర్‌ పదవి పువ్వులో పెట్టి అప్పగిస్తానని వీర వాగ్థానం చేశాడట.

మంత్రికి, డైరెక్టర్‌కి నడుమ

నిమ్స్‌ డైరెక్టర్‌ పదవి తిరిగి దక్కించుకోవడానికి ఏం చేయడానికైన ప్రస్తుతం డైరెక్టర్‌ డాక్టర్‌ మనోహర్‌ సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. అయ్యా…అప్పా…అని బ్రతిమివాడి మళ్లీ కుర్చి ఎక్కేందుకు తెగ ఉబలాటపడిపోతున్నాడట. దీన్ని ఆసరాగా చేసుకున్న గంగాధర్‌ ఇంకేముంది. పైరవీకారు అవతారం ఎత్తాడట చేయబోయే పని పాత్రదే అయిన ఈ పనిపై అందరి దృష్టి ఉంటుంది. డైరెక్టర్‌ పోస్టు ఇప్పించడం అంటే అంతా ఆషామాషి వ్యవహారం కాదు. ముఖ్యమంత్రి ఆచితూచి ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. ప్రభుత్వ పనితీరు, ప్రజల ఆరోగ్య విషయాలతో ముడిపడి ఉన్న ఈ పదవిలో మరింత సమర్థవంతులు. అవసరం అనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నా…తన పైరవీ బలంతో చక్రం తిప్పి ప్రస్తుత డైరెక్టర్‌ డాక్టర్‌ మనోహర్‌కు ఈ పదవి తిరిగి కట్టబెట్టాలని గంగాధర్‌ తెర వెనుక ప్రయత్నాలను జోరుగానే కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

డాక్టర్‌ మనోహర్‌తో భారీ డీల్‌…?

ప్రస్తుత నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కందకట్ల మనోహర్‌కు తిరిగి ఆ పదవి ఇప్పించడానికి ఈటల పేషిలోని గంగాధర్‌ మనోహర్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నిమ్స్‌ డైరెక్టర్‌తో మంతనాలు జరిపాడట. డైరెక్టర్‌ పదవి ఇప్పించడానికి భారీ మొత్తంలో ఖర్చు అవుతుందని స్పష్టం చేశాడట. దీంతో పదవిని ఎటుచేసైనా దక్కించుకోవాలని ఆశ, అతృతతో ఉన్నా డాక్టర్‌ మనోహర్‌ ఖర్చుకు ఎంతమాత్రం వెనుకాడేది లేదని స్పష్టం చేసినట్లు తెలిసింది. మరోవైపు నిమ్స్‌ డైరెక్టర్‌గా పదవి దక్కిన నాటి నుంచి డాక్టర్‌ మనోహర్‌ భారీగానే వెనుకేసినట్లు వైద్యవర్గాల్లో జోరుగా ప్రచారం కొనసాగుతుంది. హైదరాబాద్‌లోని నంది హిల్స్‌లో బారీ ఖర్చుతో ఓ అందమైన భవంతిని సైతం మనోహర్‌ నిర్మిస్తున్నాడని, ఆ భవనం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నట్లు తెలిసింది. అయితే ఇంత భారీగా వెనకల వేసుకున్న మనోహర్‌ పదవిని వదులుకోవడానికి ఇష్టపడటం లేదని, అందుకే ఎంతటి ఖర్చుకైనా వెనకాడరని నిమ్స్‌లో చర్చ జరుగుతోంది.

సీఎం కార్యాలయానికి చేరిన మనోహర్‌ వ్యవహారం…?

నిమ్స్‌ డైరెక్టర్‌ పదవి దక్కించుకోవడానికి డాక్టర్‌ మనోహర్‌ అవలంభిస్తున్న తీరు డైరెక్టర్‌ వ్యవహారం అంతా సీఎంఓకు చేరినట్లు తెలిసింది. నాలుగు సంవత్సరాలకాలంలో నిమ్స్‌ డైరెక్టర్‌ అతను చేసిన పనులు తదితర వ్యవహారాలపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి ఆదేశాలతో నిమ్స్‌లో రహాస్యంగా ఆడిట్‌ నిర్వహించినట్లు సమాచారం. ఈ ఆడిట్‌లో కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. నిమ్స్‌ నిధులన్ని సక్రమంగా ఖర్చు చేయకుండా డైరెక్టర్‌ దిగమింగినట్లు ఆడిట్‌లో తెలియనట్లు తెలిసింది. దీంతో సీఎం సైతం మనోహర్‌ వ్యవహారంలో సీరియస్‌గా ఉన్నట్లు తెలియవచ్చింది.

ఈటల మనోహర్‌కే అనుకూలం…?

ప్రస్తుత నిమ్స్‌ డైరెక్టర్‌ మనోహర్‌ను తిరిగి నియమించేందుకే మంత్రి ఈటల రాజేందర్‌ చొరవ చూపుతున్నట్లు తెలిసింది. డైరెక్టర్‌ పదవిని తిరిగి కట్టబెట్టే బాద్యతను గంగాదర్‌ తన భుజాలకెత్తుకోవడంతో గంగాధర్‌ మాటకే ప్రాధాన్యతను ఇచ్చే ఈటల డాక్టర్‌ మనోహర్‌నే తిరిగి నియమించేందుకు సుముఖంగా ఉన్నారట. మనోహర్‌కు పదవి తిరిగి కట్టబెట్టేందుకు గంగాధర్‌ బారీ డీల్‌ కుదుర్చుకోగా సీఎం పేషిలో పని చేస్తున్న ఓ ఇద్దరు అధికారులు సైతం ఇతగాడికి సహకరిస్తున్నారని తెలిసింది. దీంతో సీఎం సానుకూలంగా స్పందించే విషయాన్ని వారు చూసుకుంటారని గంగాధర్‌, డాక్టర్‌ మనోహర్‌కు డైరెక్టర్‌ పదవి ఇప్పించి తీరుతారని ఈటల నిశ్చింతగా ఉన్నారట.

సీనియర్‌ వైద్యుల్లో అసంతృప్తి…?

డాక్టర్‌ మనోహర్‌కే నిమ్స్‌ డైరెక్టర్‌ పదవి తిరిగి కట్టబెట్టేందుకు మంత్రి ఈటల మొగ్గు చూపుతుండటం, గంగాధర్‌ తెర వెనుక ప్రయత్నాలపై సీనియర్‌ వైద్యుల్లో జోరుగా చర్చ సాగుతుంది. డాక్టర్‌ మనోహర్‌ కంటే అన్నిరకాల అర్హతలు, సీనియారిటి కలిగి ఉన్న వైద్యులు ఈ విషయంలో పూర్తి అసంతృప్తిగా ఉన్నారట. నాలుగు సంవత్సరాలపాటు మనోహర్‌నే డైరెక్టర్‌గా కొనసాగించి తిరిగి మళ్లీ అతన్నే కొనసాగించేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని వారు చూస్తున్నారట. రెండు, మూడు సంవత్సరాలలో పదవీవిరమణ చేయనున్న వైద్యులు తమకు డైరెక్టర్‌గా సేవ చేసే అవకాశం ఎందుకు కల్పించరని మంత్రి ఈటలను ప్రశ్నిస్తున్నారట. ఒకవేళ డాక్టర్‌ మనోహర్‌ను డైరెక్టర్‌గా తిరిగి నియమిస్తే నిమ్స్‌లో జరిగిన అవినీతిని, పదవి కోసం అతను కుదుర్చుకున్న భారీ డీల్‌ ప్రభుత్వం సమర్థించినట్లేనని, పరోక్షంగా వీటిని ప్రోత్సహించినట్లేనని కొంతమంది వైద్యులు అంటున్నారు. అయితే ఈ డైరెక్టర్‌ పదవి విషయంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఏం నిర్ణయం తీసుకుంటారో, మనోహర్‌నే కొనసాగించాలని ఈటల పంపే పైల్‌ను ఎలా స్వీకరిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here