టిఎన్జీవో అధ్యక్షుడు వర్సెస్‌ ప్రిన్సిపాల్స్‌

వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ క్యాంపు కార్యాలయంలో భారిఎత్తున అవినీతి జరిగిన విషయంలో పింగిళి మహిళజూనియర్‌ కళాశాలలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎం.సమ్మయ్య దొంగదారిలో డిఐఈవో కార్యాలయంలో అకౌంట్స్‌ చేసే ఉద్యోగి సహాయంతో భాయ్స్‌లిస్టులో తన పేరును పెట్టుకొని, డబ్బులు నొక్కేసిన విషయం రాష్ట్రవ్యాప్తంగా దుమారంలేపింది. సమ్మయ్య చేసిన పనికిమాలిన దొంగపనిని టిఎన్జీవో(ఇంటర్మీడియట్‌ నాన్‌-టీచింగ్‌) అర్బన్‌ అధ్యక్షడు నవీన్‌ మా క్యాంపు మా యిష్టం..రాయడానికి నీవెవరు అంటూ గుండాగిరిని ప్రదర్శించాడు. అంతటితో ఆగకుండా ప్రిన్సిపాళ్లను, డిఐఈవో లింగయ్యను అసభ్యపదజాలంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం జరిగింది. అసలు విషయం బయటికి రావడంతో నవీన్‌ వ్యాఖ్యలపై వరంగల్‌ ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా ప్రిన్సిపాల్స్‌ తీవ్రంగా మండిపడుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై డిఐఈవోకు, ఆర్జేడికి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించగా వారు అందుబాటులో లేకపోవడంతో వాయిదా వేసుకున్నట్లు విశ్వసనీయసమాచారం.

సమ్మయ్య నవీన్‌లు ఫిఫ్టీ-ఫిఫ్టీ దండుకున్నట్లు అనుమానం..!

ఇంటర్మీడియట్‌ క్యాంపు కార్యాలయంలో ఎం.సమ్మయ్య దొంగదారిలో నొక్కేసిన డబ్బులలో టిఎన్జీవో అధ్యక్షడు నవీన్‌ వాటా ఉండొచ్చనే అనుమానాలు ఆయన మాట్లాడిన తీరును బట్టి అర్ధమవుతున్నదని విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు, అవినీతి వ్యతిరేఖ పోరాట సంఘం నేతుల తమ అనుమానాన్ని వ్యక్తంచేస్తున్నారు.

సమ్మయ్యపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం

పింగిళి మహిళజూనియర్‌ కళాశాలలో పనిచేస్తున్న సీనియర్‌ అసిస్టెంట్‌ ఎం.సమ్మయ్య అడ్డదారిలో క్యాంపులో భాయ్‌గా తన పేరునుపెట్టుకొని ప్రభుత్వసొమ్మును, అధికారుల కళ్లుగప్పి నొక్కేసిన విషయానిక సంబందించిన పక్కాఆధారాలు లభ్యంకావడంతో ఆధారాలతోవెళ్లి వరంగల్‌ అర్బన్‌జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ను కలువనున్నట్లు విద్యార్థి సంఘం నాయకులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here