అధికారుల నిర్లక్ష్యంతో…అక్రమనిర్మాణాలు

ఇంత నిర్లక్ష్యమా..ఇంత అన్యాయమా..ప్రజలు చెల్లించే డబ్బులతో నెలనెల వేతనాలు తీసుకుంటున్న వీరు ఎందుకు తమ విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు? తమ స్థలంలో అక్రమార్కులు దర్జాగా తన భూమిని కబ్జాచేసి అక్రమంగా దొంగ అనుమతులతో ఇండ్లనిర్మాణం చేస్తున్నారని చెప్పులరిగిలే తిరిగినా తనకు వరంగల్‌ మహానగర పాలకసంస్థ, కాకతీయ అర్బన్‌డెవలప్‌మెంట్‌ అథారిటి-వరంగల్‌ అధికారుల నుండి ఎలాంటి న్యాయం జరగటంలేదని బాధితుడు ఖాజామన్సూర్‌ అహ్మద్‌ తన ఆవేదనను ‘నేటిధాత్రి’ ప్రతినిదికి వ్యక్తపరిచాడు. భాదితుని కథనం ప్రకారం 47వ.డివిజన్‌నందు సర్వే నెం.70, గోపాలపురంలో తన స్థలంలో కొంతమంది అక్రమంగా చొరబడి దొంగదారిలో తప్పుడు అనుమతులు తెచ్చుకొని ఇండ్ల నిర్మాణం చేస్తున్నారని ఆయన ఆవేదన చెందుతున్నాడు. ఈ విషయంపై సంబంధిత అదికారులను ఎన్నిసార్లు న్యాయం చేయాలని మొరపెట్టుకున్నా ఫలితం లేదని పేర్కొన్నాడు.ఓ వైపు కోర్టులో కేసు నడుస్తుడగానే అక్రమార్కులు ఇండ్లనిర్మాణం చేస్తున్నారని మున్సిపల్‌ బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్ల దృష్టికి తీసుకువచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని మన్సూర్‌ తాను పడిన కష్టాలను, ఇబ్బందులను ‘నేటిథాత్రి’కి చెప్పుకున్నాడు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తనకు న్యాయం చేయాలని, కోర్టులో కేసు నడుస్తుండగానే అక్రమంగా ఇండ్ల నిర్మాణం చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని తన భూమికి రక్షణ కల్పించాలని మన్సూర్‌ అదికారులను కోరుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here