దండాలో సమ్మన్నా…దండుకో డబ్బులన్నా..!

దండాలో సమ్మన్నా…దండుకో డబ్బులన్నా..!

వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ పేపర్‌వాల్యుయేషన్‌ క్యాంపులో కాసులకు కక్కుర్తిపడి, అక్రమంగా, క్యాంపులో భాయ్‌గా పనిచేసినట్టు తన పేరును నమోదు చేసుకొని అక్రమంగా డబ్బులను నొక్కేశాడు.ఓ ప్రభుత్వ ఉద్యోగి అయివుండి క్యాంపులో రోజువారి కూలీగా పనిచేసినట్టు డబ్బులను మెక్కేసిన వైనాన్ని ప్రతిఒక్కరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఛీ..ఛీ..సిగ్గులేకుండా ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంతటి నీచమైన, అవినీతి, అడ్డదారిలో వెళ్లడానికి సిగ్గు అనిపించలేదా? అని నిరుద్యోగులు సమ్మయ్య అవినీతి, అక్రమ లీలలపై మండిపడుతున్నారు. పింగిళి మహిళా జూనియర్‌ కళాశాలలో సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం.సమ్మయ్య వ్యవహారంపై విద్యార్థిసంఘాలు, ప్రజాసంఘాలు, నిరుద్యోగ సంఘాలు ఇంటర్మీడియట్‌ ఆర్జేడికి, ఇంటర్‌బోర్డు కమిషనర్‌-హైదరాబాద్‌కు వెళ్లి ఫిర్యాదు చేయనున్నట్లు విశ్వసనీయసమాచారం.

సమ్మయ్యతోపాటు బంధువులు ఉన్నారా?

క్యాంపులో సీనియర్‌ అసిస్టెంట్‌ సమ్మయ్యతో పాటు అతని బంధువులు కూడా ఉన్నారనే అనుమానం వ్యక్తమవుతున్నది. క్యాంపులో సమ్మయ్యకు తెలిసినవారి అకౌంట్లను కూడా ఇచ్చారని వారిఅకౌంట్లలో పనిచేయకున్నా, సమ్మయ్యకు డబ్బులు వేసినట్టుగానే ఈయన బంధువుల అకౌంట్లలో కూడా డబ్బులు వేశారని బయట జోరుగా ప్రచారం జరుగుతున్నది.

టిఎన్జీవో నేత అండదండలతో అవినీతి దందా

క్యాంపులో పనిచేయకున్నా సమ్మయ్య కూలీగా పనిచేసినట్టు తనపేరును నమోదు చేయడానికి ఓ టిఎన్జీవో నేత సహకరించాడని పలు అనుమానాలు వ్యక్తంఅవుతున్నాయి. ఇతనికి సహకరించిన టిఎన్జీవో నేత, సమ్మయ్య ఒకే క్యాడర్‌కు చెందిన ఉద్యోగులు కావడం, వీరిద్దరికి ఎంతో అవినాభావసంబందం ఉండటం, డిఐఈవోలో క్యాంపు బిల్లులు చేసినవారు కూడా వీరికి ఎంతో సహకరించారని, డిఐఈవో కార్యాలయంలో అకౌంట్స్‌ చేసేవారు సహకరించడం వల్లనే సమ్మయ్య క్యాంపు డబ్బులను అక్రమంగా, దొంగతనంగా, ఏమాత్రం సిగ్గులేకుండా నొక్కేయడం సులువుగా మారిందని ప్రచారం జరుగుతున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here