Menu Close

టిఎన్‌జీవో అర్బన్‌ అధ్యక్షుడి…నోటిదురుసు

టిఎన్‌జీవో అర్బన్‌ అధ్యక్షుడి…నోటిదురుసు

-‘నేటిధాత్రి’ ప్రతినిధిపై టిఎన్‌జీవో అధ్యక్షుడి గుండాగిరి

అతనో ప్రభుత్వ ఉద్యోగి..నెలకు వేలల్లో వేతనం తీసుకుంటున్న భాద్యత గల వ్యక్తి..అలాంటి వ్యక్తే అడ్డదారిన, అక్రమంగా, అవినీతికి పాల్పడి దొంగలాగా ప్రభుత్వసొమ్మును నొక్కేస్తే అతనిని ఏమనాలి? ప్రభుత్వ ఉద్యోగి హుందాగా వ్యవహరించాల్సిన అతను కాసులకు కక్కుర్తిపడి కూలీగా మారినట్టు ఇంటర్మీడియట్‌ పేపర్‌ వాల్యుయేషన్‌ క్యాంపులో ప్రభుత్వ ఉద్యోగి అయిఉండి కూలీగా క్యాంపుభాయ్స్‌ లిస్టులో తన పేరును పెట్టుకొని అక్రమంగా ప్రభుత్వ సొమ్మును నొక్కేసినందుకు ‘నేటిధాత్రి’లో ”ప్రభుత్వ ఉగ్యోగి..కూలీ నెం.1” అనే శీర్షికతో ప్రచురిస్తే అది జీర్ణించుకోలేని టిఎన్‌జీవో ఇంటర్మీడియట్‌ నాన్‌-టీచింగ్‌ అసోసియేషన్‌ వరంగల్‌ అర్బన్‌జిల్లా అధ్యక్షుడు నవీన్‌ ‘నేటిధాత్రి’ ప్రతినిధికి ఫోన్‌చేసి ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు. నీకెంత ధైర్యం నా మనిషి మీదనే రాస్తావా? అవును పింగిళి కాలేజీలో పనిచేసే ఆ సీనియర్‌ అసిస్టెంట్‌ కాలేజీలో తీసుకుంటాడు..క్యాంపులో తీసుకుంటాడు..ఆయనొక్కడే డబ్బులు నొక్కేశాడా? డిఐఈవో లింగయ్యతోపాటు అన్ని కాలేజీల ప్రిన్సిపాల్స్‌ క్యాంపులో డబ్బులను దెం…తిన్నరు..నీకు దమ్ముంటే అది రాయి..ఒక్కన్నే పట్టుకొని రాస్తే బాగుండదు..ఎవడెవడు ఎంత దెం…తిన్నాడో చెప్తా రాస్తావా? అంటూ హెచ్చరించాడు.ఏదేమైనప్పటికి ఇంత నిస్సిగ్గుగా డిఐఈవోలో జరిగిన అవినీతిని సమర్ధిస్తున్నా టిఎన్‌జీవో(ఇంటర్‌ నాన్‌-టీచింగ్‌) అర్బన్‌జిల్లా అధ్యక్షుడి తీరుపట్ల టిఎన్‌జీవో అదిష్టానం విచారణ జరుపాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎవడెవడు దెం…తిన్నడో చెప్తా..రాస్తావా?

ఇంటర్మీడియట్‌ క్యాంపులో చాలా అవినీతి జరిగింది. ప్రతి ఒక్కరు లెక్చరర్స్‌, డిఐఈవో లింగయ్య, 57 కాలేజీల ప్రిన్సిపాళ్లు ఇష్టమొచ్చినట్లు బిల్లులు పెట్టుకొని దెం…తిన్నరు అవి మీకు కనబడతలేవా? ఎవరెవరు ఎంత తిన్నారో నేను ఇస్తాను రాస్తావా? అంటూ సవాల్‌ విసిరాడు. ప్రతినిధి స్పందిస్తూ ‘నేటిధాత్రి’ నిజాలను ఎప్పుడు నిర్భయంగా రాస్తుంది…మీదగ్గర క్యాంపులో జరిగిన అవినీతికి సంబందించిన సమాచారం తీసుకువస్తే ఖచ్చితంగా రాస్తాము అనడంతో సరే మీకు ఎవరెవరు ఎంత తిన్నారో..ఎలా తిన్నారో అన్ని వివరాలు అందిస్తాను రాయండి అని ఫోన్‌పెట్టేశాడు.

మీమేమన్నా అటెండర్లమా..?

టిఎన్‌జీవో (ఇంటర్‌ నాన్‌టీచింగ్‌) అర్బన్‌జిల్లా అధ్యక్షుడు నవీన్‌

ఇంటర్మీడియట్‌ పేపర్‌ వాల్యుయేషన్‌ క్యాంపులో పింగిళి మహిళా జూనియర్‌ కాలేజ్‌కు చెందిన సీనియర్‌ అసిస్టెంట్‌ కూలీగా పనిచేయడానికి ఆయన ఏమన్నా అటెండ్‌ అనుకుంటానవా? ఆయనో సీనియర్‌ అసిస్టెంట్‌ ఆయన క్యాంపులో కంప్యూట్‌ అపరేటర్‌గా పనిచేశాడు.దీనికి సంబందించిన పనిదినాల హాజరుపట్టిక మా వద్ద ఉంది. మా నిజాయితీని నిరూపించుకుంటాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *