‘నేటిధాత్రి’ కథనానికి స్పందన

‘నేటిధాత్రి’ కథనానికి స్పందన

– అక్రమ వెంచర్లపై రెవెన్యూ కొరడా

శనివారం ‘నేటిధాత్రి’ పత్రికలో ప్రచురితమైన ‘బోరా’ సాబ్‌ కబ్జా కహానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. ఈ కథనంలో అక్రమంగా వెంచర్లు వేస్తున్నారని ప్రస్తావించడంతో ధర్మారం, గొర్రెకుంట ప్రాంతాల్లో కొంతమంది అక్రమంగా నిర్వహిస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లపై గీసుగొండ రెవెన్యూ అధికారులు కొరడా ఝళిపించారు. ఈ ప్రాంతంలో అక్రమ వెంచర్లలో ఉన్న బౌండరీలను రెవెన్యూ అధికారులు ఈ సోమవారం తొలగించారు. గీసుగొండ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ అర్జున్‌ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది బౌండరీలను తొలగించి అక్రమ వెంచర్లను సహించేది లేదని చెప్పారు. అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా గీసుగొండ మండలంలో ఎవరు వెంచర్లు వేసిన సహించేది లేదని, అక్రమార్కులపై చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here