‘నేటిధాత్రి’ కథనానికి స్పందన

‘నేటిధాత్రి’ కథనానికి స్పందన

– అద్దె రూముల యజమానులకు పోలీసుల కౌన్సెలింగ్‌

నేటిధాత్రి కథనం ‘అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా ”అన్నారం” కు స్పందించిన పోలీసులు, అధికారులు రూముల అద్దెకు ఇచ్చే యజమానులకు పోలీసులు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పర్వతగిరి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వీరేంధర్‌ మాట్లాడుతూ రూంలు అద్దెకు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా రిజిస్టర్‌తోపాటు ఏదైనా అడ్రస్‌ ప్రూఫ్‌ తీసుకోవాల్సిందిగా సూచించారు. లేనిచో కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు చేపట్టినట్లయితే ఖచ్చితంగా కేసులు తప్పవని, అనుమానిత కార్యకలాపాలను పోలీసులకు తెలియపర్చాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పిఎస్సై వంశీకష్ణ, సిబ్బంది రవి, యాకన్న, అద్దె రూముల యజమానులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here