wise mppga journalistku avakasham kalipinchali, వైస్‌ ఎంపీపీగా జర్నలిస్టుకు అవకాశం కల్పించాలి

వైస్‌ ఎంపీపీగా జర్నలిస్టుకు అవకాశం కల్పించాలి

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలం వైస్‌ ఎంపీపీగా మాదన్నపేట ఎంపిటిసి కొండం శ్రీనివాస్‌కు అవకాశం కల్పించాలని అతని అనుచరులు, గ్రామస్తులు రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. జర్నలిస్టుగా గత దశాబ్ధకాలం నుంచి సేవలందిస్తూ మండలంలో విస్తృతమైన పరిచయలు ఉన్న శ్రీనివాస్‌కు వైస్‌ ఎంపీపీగా అవకాశం కల్పిస్తే పార్టీ మరింతగా అభివృద్ది అవుతుందని వారంటున్నారు. తెలంగాణ ఉద్యమకాలంలో జర్నలిస్టుగా కొనసాగుతూనే ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్టూ ఉప్పల్‌ రైల్‌రోకో ఢిల్లీలో ఉద్యమసెగను రగిల్చిన ఆయనకు పదవిని కట్టబెడితే బాగుంటుందన్నారు. ఉద్యమకాలం నుంచి మంత్రి ఈటెల రాజేందర్‌కు అత్యంత సన్నిహితంగా మెలుగుతూ అన్ని సందర్భాల్లో ఆయన వెంట నడిచిన కొండం శ్రీనివాస్‌ వైస్‌ ఎంపీపీ పదవికి అర్హుడని వారంటున్నారు. మంత్రి వివిధరకాల సమీకరణాలను, పనిచేసే తత్వాన్ని గుర్తించి వైస్‌ ఎంపీపీగా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. మంత్రి ఈటెలకు మాధన్నపేట గ్రామం అన్ని సందర్భాల్లో తోడుగా నిలిచిందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here