trs cleansweap, టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌

టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌

శుక్రవారం మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి, నల్లబెల్లి, చెన్నారావుపేట, ఖానాపురం, నెక్కొండ, నర్సంపేట మండలాలలో అట్టహాసంగా ముగిశాయి. నర్సంపేట మండలం ఎంపిపి ఎన్నిక ఉద్రిక్త వాతావరణంలో ఎన్నిక జరిగింది. కాంగ్రెస్‌ పార్టీకి ఎంపిపి ఎన్నికకు ఆరుగురు ఎంపిటిసిలు ఉన్నప్పటికీ అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ ఎత్తులకు పైఎత్తులు వేసి కాంగ్రెస్‌ పార్టీ నుండి ముగ్గురు ఎంపిటిసి సభ్యులను తమ శిబిరంలోకి చేర్చుకుని ఉద్రిక్తత వాతావరణంలో ఎంపిపి ఎన్నికను చేసుకుని నియోజకవర్గ వ్యాప్తంగా ఆరు ఎంపిపి స్థానాలను టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌ చేసుకుంది. నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపిపిలు, వైస్‌ఎంపిపిగా వివరాలు దుగ్గొండి మండల ఎంపీపీగా కట్ల కొమల, వైస్‌ ఎంపీపీగా పల్లాటి జయపాల్‌రెడ్డి ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా నెక్కొండ మండల ఎంపీపీగా జాటోత్‌ రమేశ్‌, వైస్‌ఎంపీపీగా పుండరీకం, నర్సంపేట మండలం ఎంపీపీగా మోతె కళమ్మ, వైస్‌ఎంపీపీగా అజ్మీర మౌనిక, ఖానాపురం మండల ఎంపీపీగా వేములపల్లి ప్రకాశరావు, వైస్‌ ఎంపీపీగా ఉమారాణి, చెన్నారావుపేట: ఎంపీపీగా విజేందర్‌, వైస్‌ ఎనపీపీగా కష్ణారెడ్డి, నల్లబెల్లి: ఎంపీపీగా ఊడుగుల సునీత, వైస్‌ ఎంపీపీగా శ్రీలతలు ఎన్నికైనారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. డిజె మోతలతో, డప్పుచప్పుళ్ల మధ్య, మహిళల కోలాటాలు, బాణాసంచాతో గ్రామాలు, మండలకేంద్రాలు మారుమ్రోగాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here