congress nethala nirasana, కాంగ్రెస్‌ నేతల నిరసన

కాంగ్రెస్‌ నేతల నిరసన

సీఎల్పీని టిఆర్‌ఎస్‌లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ భూపాలపల్లిలో కాంగ్రెస్‌ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం పీసీసీ ఆదేశాల మేరకు కాంగ్రెస్‌ సీఎల్పీని టిఆర్‌ఎస్‌లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ భూపాలపల్లి అంబేద్కర్‌ సెంటర్‌లో కాంగ్రెస్‌ నాయకులు నోటికి నల్లరిబ్బన్‌ చుట్టుకుని నిరసన తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు ఐతే ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here