vikasinchina kamalam, వికసించిన కమలం

వికసించిన కమలం

తెలంగాణలో గురువారం వెలువడిన పార్లమెంట్‌ ఫలితాలలో భారతీయ జనతా పార్టీ 4స్థానాలు కైవసం చేసుకుందని, 4స్థానాల్లో బిజెపి గెలవడం కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపిందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గురుమూర్తి శివకుమార్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో 302స్థానాలలో గెలుపొంది దేశంలోనే అతిపెద్ద పార్టీగా బిజెపి అవతరించిందని తెలిపారు. తెలంగాణలో 2023లో జరిగే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం వరంగల్‌, కరీంనగర్‌ జాతీయ రహదారిపై పెద్దఎత్తున బిజెపి కార్యకర్తలు బాణసంచాలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజేవైఎం నాయకులు గుండమీది శ్రీనివాస్‌, ఆలేటి అశోక్‌, హరికృష్ణ, కుమారస్వామి, రమేష్‌, సాంబయ్య, సంపత్‌, సాయిచంద్‌, కుమారస్వామి, చంద్రారెడ్డి పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here