cheai chathikalapadindi, చేయి చతికిలపడింది

చేయి చతికిలపడింది

సార్వత్రిక ఎన్నికల్లో చేయి మరోసారి చతికిలపడింది. బిజెపి వ్యతిరేఖ పవనాలు వీస్తున్నాయని అందరు భావించినా అంచనాలన్నింటిని తోసివేసి కమలం మరోసారి వికసించి గుభాలిస్తోంది. 331 స్థానాల్లో సింగిల్‌ లార్జెస్టెట్‌ పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించబోతుంది. అధికారంపై అనేక ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ పోటీలో పూర్తిగా వెనుకబడిపోయి కేవలం 84 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అమెథీలో కాంగ్రెస్‌ ప్రధాని అభ్యర్థి, జాతీయ అధ్యక్షుడు మెజార్టీలో వెనుకబడిపోతూ కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. రాహుల్‌పై పోటీ చేస్తున్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ముందంజలో కొనసాగుతూ రాహుల్‌గాంధీకి చుక్కలు చూపిస్తోంది. రాహుల్‌ చరిష్మా, ప్రియాంకగాంధీ ప్రచారం కాంగ్రెస్‌కు ఎంతమాత్రం కలిసిరాలేదని సుస్పష్టం అవుతోంది. కాంగ్రెస్‌ను ఆదుకోవడానికి వచ్చి ఐదు సంవత్సరాల్లోనైనా ఓ ఆపద్భాంధవుడు కావాలని కాంగ్రెస్‌ శ్రేణులు ఆశిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here