adavi gramllo marintha abhivruddi chesi chupedatha, అడవి గ్రామాల్లో మరింత అభివద్ధి చేసి చూపెడతా

అడవి గ్రామాల్లో మరింత అభివద్ధి చేసి చూపెడతా

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని టిఆర్‌ఎస్‌ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపిస్తే అడవి గ్రామాలలో మరింత అభివృద్ది చేసి చూపెడతామని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి మండలం ఆజంనగర్‌ గ్రామంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. భూపాలపల్లి మండల జడ్పీటీసీ అభ్యర్థి కల్లెపు శోభ, ఎంపీటీసీ అభ్యర్థి జంగ సునితలను అధిక మెజారిటీతో గెలిపించగలరని కోరారు. అనంతరం అదే గ్రామానికి చెందిన ఐకెపి సెంటర్లను సందర్శించి సెంటర్ల పనితీరును పరిశీలించారు. ఐకెపి సెంటర్లకు చెందిన అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here