zptc barilo police ramachandraiah, జడ్పీటిసి బరిలో పోలీస్‌ రామచంద్రయ్య

జడ్పీటిసి బరిలో పోలీస్‌ రామచంద్రయ్య

కంది జడ్పీటిసి స్వతంత్ర అభ్యర్థిగా ఎస్సీ, ఎస్టీల ఐక్య సంఘటన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పోలీస్‌ రామచంద్రయ్య బుధవారం సంగారెడ్డి ఎంపిడిఓ కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యావత్‌ ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాలు ఒక్కటై కలిసిపోవాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీలు టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు ఈ వర్గాలకు రాజకీయంగా సరైన గుర్తింపు ఇవ్వడం లేదని, దిక్కుతోచని పరిస్థితి ఉందని, కనుక ప్రజల కోసం నేను ఉన్నానని హామీ ఇస్తున్నానని అన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రాజ్యాధికారం దళితులకు రావాలని ఆకాంక్షించారని, కావున తాను జడ్పీటీసీగా పోటీచేస్తున్నానని తెలిపారు. ప్రజలు పార్టీలకు సంబంధం లేకుండా తనను అధిక మెజారిటీతో ఓటువేసి గెలిపించాలని కోరారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తాను చూపి 4500ఓట్లు సాదించామని, ఇప్పుడు 20వేల ఓట్ల మెజారిటీ సాధించి జడ్పీటిసిగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here